అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। 14 ।।
అన్నాత్ — అన్నము నుండి; భవంతి — జీవించి ఉండుట; భూతాని — ప్రాణులు; పర్జన్యాత్ — వర్షముల వలన; అన్న — ధాన్యము/అన్నము; సంభవః — ఉత్పత్తి; యజ్ఞాత్ — యజ్ఞములు చేయటం నుండి; భవతి — కలుగును; పర్జన్యః — వాన; యజ్ఞ — యజ్ఞము; కర్మ — నిర్దేశింపబడిన కర్తవ్యములు (విహిత కర్మలు); సముద్భవః — జనించును.
BG 3.14: సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి, మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల (విహిత కర్మలు) ఆచరణచే యజ్ఞము జనిస్తుంది.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। 14 ।।
సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి, మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల (విహిత …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
ఇక్కడ శ్రీ కృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు. వర్షం వలన ధాన్యం ఉత్పన్నమగును. ధాన్యం భుజించబడి రక్తముగా రూపాంతరం చెందుతుంది. రక్తము నుండి, వీర్యము జనించును. వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు, వీటిచే ప్రీతినొందిన దేవతలు వర్షాలు కురిపిస్తారు. అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది.