Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 4, Verse 18

కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః ।
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ।। 18 ।।

కర్మణి — కర్మ; అకర్మ — అకర్మ యందు; యః — ఎవరైతే; పశ్యేత్ — చూసేదరో; అకర్మణి — అకర్మ; చ — మరియు; కర్మ — కర్మ; యః — ఎవరైతే; సః — వారు; బుద్ధి-మాన్ — వివేకవంతులు; మనుష్యేషు — మనుష్యులలో; సః — వారు; యుక్తః — యోగులు; కృత్స్న-కర్మ -కృత్ — సమస్త కర్మలను చేయువారు.

Translation

BG 4.18: ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనేవున్నా, వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు.

Commentary

అకర్మలో కర్మ: ఒక రకమైన అకర్మ పద్ధతిలో జనులు తమ సామాజిక విధులను భారమైనవిగా తలిచి వాటిని సోమరితనంతో వదిలివేస్తారు. భౌతికంగా కర్మలను వదిలి పెట్టినా, వారి మనస్సు ఇంద్రియ వస్తు-విషయముల పైనే చింతన చేస్తుంది. అటువంటి మనుష్యులు ఏమీ చేయనట్టు కనపడ్డా, వారి సోమరితనం నిజానికి పాపపు పని. అర్జునుడు తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయను అన్నప్పుడు, శ్రీ కృష్ణుడు అలా చేయటం పాపము అన్నాడు, అలాంటి అకర్మ వలన నరకలోకాలకు వెళ్ళవలసి వస్తుంది అని వివరించాడు.

కర్మలో అకర్మ: కర్మ యోగులు చేసే ఇంకొక రకమైన అకర్మ ఉంది. వారు తమ సామాజిక విధులను ఫలాపేక్ష లేకుండా, కర్మ ఫలములను భగవంతునికే అంకితం చేస్తూ పని చేస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, వారు కర్మ బంధాలలో చిక్కుకోరు, ఎందుకంటే వారు తమ భోగాన్ని ఆశించరు. భారత చరిత్రలో ఏంతో మంది మహారాజులు - ధ్రువుడు, ప్రహ్లాదుడు, యుధిష్ఠిరుడు, ప్రిథువు, మరియు అంబరీషుడు - తమ రాజధర్మాలను తమ శక్తానుసారం నిర్వర్తించారు, అదే సమయంలో ప్రాపంచిక వాంఛల యందు వారి మనస్సు లేదు కాబట్టి వారి పనులు అకర్మ గా పరిగణించబడ్డాయి. ఈ అకర్మకే ఉన్న మరో పేరు 'కర్మ యోగము', ఇదే విషయం ఇంతకు క్రితం రెండు అధ్యాయాలలో కూడా విస్తారంగా చర్చించబడింది.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
4. జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!