అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ।। 41 ।।
అధర్మా — అధర్మము; ఆభిభవాత్ — ప్రబలిపోవుట; కృష్ణ — శ్రీ కృష్ణా; ప్రదుష్యంతి — నీతి తప్పిన వారై; కుల-స్త్రియః — కుటుంబంలోని స్త్రీలు; స్త్రీషు — స్త్రీలు; దుష్టాసు — దుర్నీతి పరులై; వార్ష్ణేయ — వృష్ణి వంశస్థుడా; జాయతే — పుడతారు; వర్ణ-సంకరః — అవాంఛిత సంతానం.
BG 1.41: దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణా, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు; మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, ఓ వృష్ణి వంశస్థుడా, అవాంఛిత సంతానం జన్మిస్తారు.
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ।। 41 ।।
దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణా, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు; మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, ఓ వృష్ణి వంశస్థుడా, అవాంఛిత …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
వైదిక నాగరికత, స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యత నిచ్చింది. అందుకే మను-స్మృతిలో ‘యత్ర నార్యస్ తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః (3.56) ‘ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో, మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడుతారో, అక్కడ దేవతలు హర్షిస్తారు.’ కానీ, స్త్రీలు నీతిబాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు, బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి, దాన్ని అదునుగా తీసుకొనుటం వలన అవాంఛిత సంతానం కలుగుతారు.