అర్జున ఉవాచ ।
కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।
అర్జున ఉవాచ — అర్జునుడు ఇలా అడిగెను; కైః — ఎటువంటి; లింగైః — లక్షణములు; త్రీన్ — మూడు; గుణాన్ — ప్రకృతి గుణములు; ఏతాన్ — ఇవి; అతీతః — అతీతులైన వారు; భవతి — ఉందురు; ప్రభో — ప్రభూ; కిం — ఏమిటి? ఆచారః — నడవడిక; కథం — ఎట్లా; చ — మరియు; ఏతాన్ — ఇవి; త్రీన్ — మూడు; గుణాన్ — ప్రకృతి గుణములు; అతివర్తతే — అతీతులు అవుతారు.
BG 14.21: అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?
అర్జున ఉవాచ ।
కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।
అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
అర్జునుడు శ్రీ కృష్ణుడి నుండి త్రి-గుణములకు అతీతులవటం గురించి విని ఉన్నాడు. అందుకే, ఇప్పుడు ఈ త్రి-గుణముల విషయమై మూడు ప్రశ్నలను అడుగుతున్నాడు. 'లింగైః' అంటే 'లక్షణములు' అని అర్థం. అతని మొదటి ప్రశ్న ఏమిటంటే, ‘ఈ త్రిగుణాతీతుల లక్షణములు ఎలా ఉంటాయి?’ అని. ‘ఆచారః' అంటే 'ప్రవర్తన' అని అర్థం. అర్జునుడి రెండవ ప్రశ్న ఏమిటంటే: ‘ఈ త్రిగుణాతీతుల ప్రవర్తన ఎలా ఉంటుంది?’ అని. 'అతివర్తతే' అంటే 'అతీతులైపోవటం'. మూడవ ప్రశ్న ఏమిటంటే: ‘ఈ త్రి-గుణములకు అతీతులము కావటం ఎలా?’ అతని ప్రశ్నలకు పద్ధతిప్రకారం సమాధానం చెప్తున్నాడు, శ్రీ కృష్ణుడు.