ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ।। 7 ।।
ఆహారః — ఆహారము; తు — నిజముగా; అపి — కూడా; సర్వస్య — అన్నింటిలో; త్రివిధః — మూడురకములు; భవతి — ఉండును; ప్రియః — ప్రియమైన; యజ్ఞః — యజ్ఞము; తపః — తపస్సు; తథా — మరియు; దానం — దానము; తేషాం — వారికి; భేదం — భేదము; ఇమం — ఇది; శృణు — వినుము.
BG 17.7: వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు కూడా వారియొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము.
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ।। 7 ।।
వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు కూడా వారియొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
మనస్సు మరియు శరీరము ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటాయి. కాబట్టి, మనుష్యులు తినే ఆహారము వారి స్వభావమును ప్రభావితం చేస్తుంది మరియు వారి స్వభావము వారి ఆహార ఇష్ట-అయిష్టములను ప్రభావితం చేస్తుంది. ఛాందోగ్య ఉపనిషత్తు ప్రకారం, మనం తినే వాటిలో ముతక(స్థూల) పదార్థం మలముగా బయటకు వచ్చేస్తుంది; మెత్తనిది మాంసముగా అవుతుంది; మరియు సూక్ష్మమైనది మనస్సుగా అవుతుంది (6.5.1). అది ఇంకా ఇలా పేర్కొన్నది: ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః (7.26.2) ‘స్వచ్ఛమైన ఆహారం తినటం వలన, మనస్సు పవిత్రమవుతుంది.’ అలాగే దీనికి విపర్యయం కూడా సత్యమే - పవిత్రమైన మనస్సుతో ఉండేవారు పవిత్రమైన ఆహారాన్ని ఇష్టపడుతారు.