Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 2, Verse 19

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్।
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ।। 19 ।।

యః — ఎవరైతే; ఏనం — ఇది; వేత్తి — తెలుసుకుంటారో; హంతారం — చంపేది; యః — ఎవరైతే; చ — మరియు; ఏనం — ఇది; మన్యతే — అనుకుంటాడో; హతం — చంపబడేది; ఉభౌ — రెండూ; తౌ — వారు; న — కాదు; విజానీతః — జ్ఞానం కలిగిఉన్న; న — కాదు; అయం — ఇది; హంతి — చంపును; న — కాదు; హన్యతే — చంపబడును.

Translation

BG 2.19: ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు - ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు.

Commentary

మనలను మనం ఈ భౌతిక శరీరమే అని అనుకోవటం వలన మరణము అనే భ్రాంతి కలుగుతుంది. రామాయణం దీన్ని ఈ విధంగా వివరిస్తున్నది:

జౌఁ సపనేఁ సిర కాటఇ కోఈ, బిను జాగేఁ న దూరి దుఖ హోఈ

‘మన తల తెగిపోతున్నట్టుగా కల వస్తే, ఆ నొప్పి అనుభూతి మనం నిద్రలేచే వరకూ ఉంటుంది.’ కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి, కానీ దాని వలన కలిగిన నొప్పి అనుభవము మనము నిద్ర లేచి ఆ భ్రాంతిని పోగొట్టుకోనేవరకు బాధిస్తునే ఉంటుంది. అదేవిధంగా, మనము ఈ శరీరమే అన్న భ్రాంతిలో మనము మరణానికి భయపడుతాము. జ్ఞానోదయం అయిన జీవులకు, ఎవరికైతే ఈ భ్రాంతి తొలగిపోతుందో, వారికి మరణం యొక్క భయం నశిస్తుంది.

ఎవరూ కూడా ఎవరినీ చంపలేరు అన్నప్పుడు, మరి హత్య చేయడం దండించవలసిన నేరం ఎలా అవుతుంది? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే, శరీరం అనేది జీవాత్మ యొక్క వాహనం. ఏ ప్రాణి యొక్క వాహనాన్ని ధ్వంసం చేయటమైనా హింస చేసినట్టే, అది నిషిద్ధం. వేదములు స్పష్టంగా ‘మా హింస్యాత్ సర్వభూతాని’ ‘ఎవరిపట్లా హింసకు పాల్పడవద్దు.’ అని ఉపదేశిస్తున్నాయి. నిజానికి, వేదాలు జంతువులను చంపటం కూడా నేరంగా పరిగణిస్తాయి.

కానీ కొన్ని సందర్భాలలో నియమాలు మారుతాయి, మరియు హింస కూడా అవసరం అవుతుంది. ఉదాహరణకి, పాము కాటు వేయటానికి వస్తున్న సమయంలో, మారణాయుధాలతో దాడి చెయ్యబడ్డప్పుడు, జీవనాధారం లాక్కోబడినప్పుడు, ఆత్మ రక్షణ కొరకు హింస అనుమతించబడింది.

ఈ ప్రస్తుత పరిస్థితిలో, అర్జునుడికి సరియైనది ఏమిటి, హింసనా లేదా అహింసనా?, ఎందుకు? శ్రీ కృష్ణుడు, భగవద్గీత ఉపదేశము ద్వారా అతనికి విపులముగా విశదీకరిస్తాడు. ఈ వివరణలో భాగంగా, ఉపదేశ విషయం తేటతెల్లం చేయటానికి అమూల్యమైన దివ్య జ్ఞానము లోకానికి వెల్లడి చేయబడుతుంది.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
2. సాంఖ్య యోగము

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!