ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే ।
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ।। 32 ।।
ఏవం — ఈ విధముగా; బహు-విధా — వేరు వేరు విధములైన; యజ్ఞాః — యజ్ఞములు; వితతాః — విశదీకరించబడ్డాయి; బ్రహ్మణః — వేదముల; ముఖే — నోటి ద్వారా; కర్మ-జాన్ — కర్మల నుండి జనించినవి; విద్ధి — తెలుసుకొనుము; తాన్ — వారు; సర్వాన్ — అందరూ; ఏవం — ఈ విధముగా; జ్ఞాత్వా — తెలుసుకొని; విమోక్ష్యసే — నీవు మోక్షమును పొందుతావు.
BG 4.32: ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే, నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది.
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే ।
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ।। 32 ।।
ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే, నీ యొక్క …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
వేదముల ఒక అధ్బుతమైన లక్షణం ఏమిటంటే అవి ఎన్నో విభిన్నరకాల మానవ స్వభావాలను గుర్తించి వాటికి సరిపోయే విధానాలను సూచిస్తాయి. ఈ విధంగా రకరకాల మనుష్యులకు రకరకాల యజ్ఞములు వివరించబడ్డాయి. వీటన్నిటికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం ఏమిటంటే, ఇవన్నీ భక్తితో భగవత్ అర్పితముగా చేయబడాలి. ఈ అవగాహనతో వేదములలో చెప్పబడిన వివిధ రకాల ఉపదేశాలతో తికమక పడకుండా, తనకు సరిపోయే యజ్ఞ విధానాన్ని నిర్వర్తిస్తూ, భౌతిక బంధాల నుండి విముక్తి పొందవచ్చు.